Monday, November 30, 2009

సినిమా గాధ


సినిమా గాధ
వినర వినర వీరకుమరుడుని సినిమా గాధని ...ఆ వీరకుమరుడుని ఎవరొ కాదు అది నేనే. నా సినిమ గాధలొ ఎన్నొ మలుపులు, ఎన్నొ జ్ఞాపకాలు,ఎన్నొ విషయలు,ఎన్నొ అనుబంధాలు ఇంక చెప్పలెనివి ఎన్నొ మరి ఎన్నొ లెక్కపెట్టలెని అనుభూతులు ఎన్నొ ముడిపడి ఉన్నాయి.ఈ కధ రాయాలి ఎన్నొ నెలలు నుండి అనుకుంటున్నను. కాని కుదరడం లేదు.కాని ఈరోజు రాయాలి తప్పదు అని మొదలుపెట్టాను.చిన్నప్పుడూ నుండి నాకు సినిమా తొ విడదియని అనుబంధం ఉంది .ఇప్పుడు కుడా సినిమా చూస్తూ రాస్తున్నను. అది నాకు ఉన్న సినిమా పిచ్చి . నా మొదటి సినిమా సాగరసంగం ఈ సినిమా చూసినప్పుడు నాకు అసలు సినిమ గురించి ఏమి తెలియదు.ఈ విషయం మా నాన్న చెప్పాడు .. ఆ తరువాత ఎన్నొ చూసాను ఇక్కడ అక్కడ అని బేధం లేకుండా చూసాను .చిన్నప్పుడు అయితే సినిమా చుడాలి అంటే రెండు మార్గాలు ఉన్నవి .ఒకటి మా అమ్మని అడగాలి అది కుదరకపొతే ఇంకొ రెండూది బ్రహ్మాస్త్రం ఆమరణ నిరహరదిక్ష చేయడం . ఈవిధముగ చిన్నప్పుడు చూస్తూ గడిపేవాడిని . చిన్నప్పటినుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని . నేను అటు సాంగికము,ఇటు పౌరాణికం,పైన జానపదం ,కింద భయనకం లాంటి నవరసాలు అన్ని చూసేవాడిని. అసలు చెప్పాలి అంటె సినిమాయె నా ఆరో ప్రాణం .ఈ కధ లొ చిన్నప్పటీ నుండి నేను ఏలా సినిమాలు చుసాను ,దానికి పడ్డ కష్టాలు,ఉపాయాలు గురించి రాస్తూన్నను. అప్పుడు నాకు బహుసా 7 ఏళ్ళు ఉంటాయి .అప్పట్లో మా ఇంట్లొ టివి ఉండేది . డిడి1లొ ఆదివరాం సినిమా కోసం వారం అంత ఎదురుచూడటం ఎంత బాగుండేది .. నాకు అయితే ఇంకా సినిమా కి ముందు వ్యాకయత చెప్తాడు కద ఆ విషయం ఇంకా గుర్తు ఉంది . ఈ విధముగ చెప్పారు అప్పట్లొ "నమస్కా కారం దూరదర్సన్ ప్రేక్షకులు కి ". మళ్ళి తరువాత భాగం లో కలుసుకుందం .