Sunday, June 27, 2010

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…
కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||

నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||

Sunday, March 28, 2010

మా ఊరి దేవాలయం



ఎప్పటి నుండి రాయలి అనుకుంటున్నాను  మా ఊరి దేవాలయం గురించి రాయాలి. ఈ రోజు కుదిరింది..... మా ఊరు పొనుగుపాడు  . ఇక్కడ శ్రీ కాశి  నాధుడు    కొలువై ఉన్నాడు  
 
 ఫొటో లో కనపడుతున్న మా గుడి గాలి గోపురం . ఇది చాల పెద్దది . మా గాలి గోపురం గుంటూరు జిల్లా లొ రెండవ స్థానంలొ ఉంది .   



                              ఇక్కడ కనిపించెది  మా ఆలయ  ప్రధాన ద్వారం   
                                        ఇక్కడ కనిపించెది శ్రీ కాశి  నాధుడు

                               ఇక్కడ కనిపించెది శ్రీ కాశి   అన్నపూర్ణాదేవి  అమ్మ


                                                  ఇక్కడ కనిపించెది  నంది

                               ఇక్కడ కనిపించెది స్వామి వారి  కల్యాణమండపం